పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!

How jawans in Siachen Battle Minus 70 Degree Cold And Struggle with Food - Sakshi

సియాచిన్‌లో భారత సైనికుల తిండితిప్పలు

శ్రీనగర్‌ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్‌లో మైనస్‌ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్‌లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది.

ఆ వీడియోలో ఏముందంటే..  ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్‌ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top