ఈ పిల్ల ఎలుగుబంటిని చూసి చాలా నేర్చుకోవాలి!

Bear Cub is Struggle to Climb Up a Snowy mountain Gives Lesson - Sakshi

హైదరాబాద్‌ : జీవితంలో ఒక్క ఎదురుదెబ్బ తగిలితేనే ఎంతో కుమిలిపోతాం.. కుంగిపోతాం. ఇక అలాంటి ఎదురుదెబ్బలు వరుసగా తగిలితే ఈ జీవితమే వద్దనుకుంటాం. కానీ ఈ పిల్ల ఎలుగు బంటిని చూస్తే.. మాత్రం జీవితమంటే పోరాటమని.. సమస్యలపై పోరాడితినే విజయం ఉంటుందని అవగతం అవుతోంది. అవును ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఈ పిల్ల ఎలుగు బంటి వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు జీవిత పాఠాన్ని బోధిస్తోంది. ఈ వీడియోను కెనడియన్‌ టీవీ పర్సన్‌ ఒకరు ‘ఈ పిల్ల ఎలుగుబంటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు’అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేశారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. తల్లి ఎలుగు బంటి.. పిల్ల ఎలుగుబంటి రెండూ కలిసి మంచు కొండను ఎక్కుతుంటాయి. తల్లి ఎలుగు బంటి సులువుగానే మంచు కొండపైకి చేరగా.. పిల్ల ఎలుగుబంటికి మాత్రం నానా కష్టాలు పడుతుంటుంది. పైకి ఎక్కుతున్నా కొద్దీ మంచుతో కిందికి జారిపోతుంటుంది. అయినా పట్టు విడవని పిల్ల ఎలుగుబంటి తన లక్ష్యాన్ని చేరుకోవాడినికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక సారి అయితే పూర్తిగా చివరకు వచ్చిన తర్వాత తల్లి ఎలుగు బంటే నెట్టేస్తోంది. ఆ దెబ్బతో అమాంతం కిందికి పడిపోతుంది. అయినా నిరాశ చెందని ఆ పిల్ల ఎలుగు బంటి మళ్లీ తన ప్రయత్నం మొదలు పెడుతోంది. ఇలా చివరకు ఎలాగోలా పైకి చేరి తన లక్ష్యాన్ని చేరుకుంటుంది.

ఈ వీడియోను గమనిస్తే మనకు జీవిత సత్యం బోధపడుతుంది. పిల్లల సమస్యలను వారినే పరిష్కరించుకునేలా సిద్ధం చేయాలని ఆ తల్లి ఎలుగుబంటి చెబితే.. అడ్డంకులెన్ని ఎదురైన నిరాశ పడకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని పిల్ల ఎలగుబంటి చాటి చెప్పింది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top