ఏనుగుపై నుంచి పడ్డ డిప్యూటీ స్పీకర్‌

Assam Deputy Speaker Falls Off An Elephant - Sakshi

డిస్పూర్‌ :  అసోం డిప్యూటీ స్పీకర్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఏనుగు మీద నుంచి కిందపడి చిన్నగాయంతో బయటపడ్డారు. అస్సోం బీజేపీ ఎమ్మెల్యే కృపానాథ్‌ మల్లాహ్‌ ఈ నెల 5న  డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గమైన కరీంగంజ్ జిల్లాలోని రాటబరిలో ఆదివారం ఆయకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకోసం అంబారీని సిద్దం చేశారు.

అంబారిపై ఊరేగింపుగా వస్తున్న కృపానాథ్‌ దగ్గరకి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఏనుగు బెదిరి పరుగెత్తే ప్రయత్నం చేసింది. దీంతో డిప్యూటీ స్పీకర్ అదుపు తప్పి కింద పడ్డారు. వెంటను సిబ్బంది వచ్చి ఆయనను పైకి లేపారు. అదృష్టవశాత్తు ఆయన గడ్డి ఉన్న ప్రదేశంలో పడడంతో ప్రమాదమేమి జరగలేదు. ఆ వెంటనే ఆయన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదంతా అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్‌ అయింది.

డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కృనానాథ్‌ కరీంగంజ్‌ జిల్లాలోని రాటబరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2003,2011లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలవగా, 2016లో బీజేపీలో చేరి  రాటబరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top