కడుపులో కాటన్‌ మరిచిపోయారు.. | cotton forget in woman patient stomach | Sakshi
Sakshi News home page

కడుపులో కాటన్‌ మరిచిపోయారు..

Jan 28 2018 11:14 AM | Updated on Oct 20 2018 6:04 PM

సాక్షి, కోవూరు: ఆపరేషన్‌ చేశారు.. పొట్ట లోపల కాటన్‌ మర్చిపోయారు.. తాపీగా కుట్లు వేశారు.. ఇదీ నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రోగి పడిన అవస్థలు వర్ణనాతీతం. వివరాలు ఇలా ఉన్నాయి. వావిళ్లకు చెందిన ఓ మహిళకు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో గతంలో గర్భసంచి తొలగించే ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో కడుపులోనే ఉండిపోయిన కాటన్‌ను గమనించకుండా వైద్యులు కుట్లు వేశారు. ఆమెకు కొద్దిరోజులుగా కడుపు నొప్పి తీవ్రంగా వస్తుండడంతో కోవూరు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్‌ చేసి ఆమె కడుపులోంచి కాటన్‌ను తొలగించడంతో ప్రస్తుతం కోలుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement