నేడు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం | YSRCP Rajya Sabha members to be sworn in today | Sakshi
Sakshi News home page

నేడు ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు 

Jul 22 2020 5:38 AM | Updated on Jul 22 2020 8:02 AM

YSRCP Rajya Sabha members to be sworn in today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున సభలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement