ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రానికి అమ్మేశారా..!!

YSRCP Parthasarathy Slams AP CM On Special Status - Sakshi

ప్రజా సంకల్పం వల్లే రహదారుల దిగ్భందం సక్సెస్‌

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి

పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని కాగ్‌ ఆనాడే చెప్పింది..

ప్రజాపద్దుల కమిటీకి విశ్వసనీయత ఉంది: ఎమ్మెల్యే సురేష్‌

 సాక్షి,  విజయవాడ: రాష్ట్ర భవిష్యత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారధి విమర్శించారు. ప్రజా సంకల్పం వల్లే జాతీయ రహదారుల దిగ్భందం విజయవంతం అయ్యిందన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పార్థసారధి,  పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌లు మాట్లాడారు. 2016లో కేంద్రం, హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామంటే స్వాగతించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని పార్థసారధి ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు.

నాలుగేళ్ల పాలనలో ఎన్నడూ హోదా కోసం పనిచేయని ఆయనకు వైఎస్సార్‌ సీపీని విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. చం‍ద్రబాబు, లోకేశ్‌ల అవినీతిని వారి రాజకీయ భాగస్వామి పవన్‌ కల్యాణ్‌ ఎండగట్టడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ మీద యుద్ధం..ఆంధ్రుల ఆత్మ గౌరవం’ వంటి భారీ డైలాగులతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కోల్పోతున్నారని చురకలంటించారు.

కాగ్‌ పెట్టిన వాతలు..
పోలవరం నిర్మాణం పూర్తయితే పట్టిసీమ ప్రాజెక్టు వృథా అని కాగ్‌ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ గుర్తు చేశారు.  కానీ పట్టిసీమ డీపీఆర్‌ (డీటేల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు)లో దాని జీవిత కాలం 20 ఏళ్లు అని పేర్కొన్నారని టీడీపీపై ధ్వజమెత్తారు. పట్టిసీమ కాంట్రాక్టర్‌కు 22 శాతం అదనంగా చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాపద్దుల కమిటీ కూడా బయటపెట్టిందనీ.. అందుకనే ఆ సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు.

ఈ కమిటీలో వైఎస్సార్‌ సీపీ ఒక్కటే లేదని ఇతర అన్ని పార్టీల సభ్యులు ఉన్నారని అన్నారు. ఒకపైపు దేశం పురోగమిస్తుంటే.. చంద్రబాబు విదేశీ సాంకేతికత, జపాన్‌ తరహా పోరాటం అనడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి ప్రశ్నిస్తారనే భయంతో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను చూసి టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top