చంద్రబాబు  ‘పాస్ వర్డ్’ వదిలేశాడు... | YSRCP MP Vijayasai Reddy hits out at Yellow Media | Sakshi
Sakshi News home page

ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు

Feb 17 2020 10:24 AM | Updated on Feb 17 2020 10:25 AM

YSRCP MP Vijayasai Reddy hits out at Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైంది. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాడు’ అని విమర్శించారు. ‘బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్ మెంటుని మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీనీ డైరీలో రాసుకున్నాడు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ ఫర్పెక్ట్‌గా రికార్డు చేసాడు’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌ చేశారు. (ఐటీపై ఎల్లో డ్యాన్స్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement