‘15 రోజుల్లోగా బెల్టు షాపులు తొలగించాలి’ | YSRCP MLA RK Roja Demanded To Close Down Belt Shops | Sakshi
Sakshi News home page

‘15 రోజుల్లోగా బెల్టు షాపులు తొలగించాలి’

Published Wed, Jul 25 2018 4:51 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

YSRCP MLA RK Roja Demanded To Close Down Belt Shops - Sakshi

సాక్షి, విజయవాడ : 15 రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. బెల్టు షాపులను తొలగించాలని కోరుతూ బుధవారం ఆమె ప్రసాదం పాడు ఎక్సైజ్‌ కార్యాలయంకు వెళ్లి కమిషనర్‌కు వినతిపత్రం అందిచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మద్యాన్ని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు గాలికొదిలేశారని విమర్శించారు. 

రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరిగుతున్నాయని ఆరోపించారు. మహిళల సాధికారత దిశగా చంద్రబాబు సర్కార్‌ ఆలోచించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అన్ని నేరాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ప్రభుత్వం తరపున ఒక్క సంతకం పెడితే ఆ నిమిషం నుంచే ఏదైనా అమల్లోకి రావాలని, అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందన్నారు. కోర్టులను కూడా ఎక్సైజ్‌ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement