అది భయంకరమైన లేఖ : అంబటి | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి సీఎం జగన్‌ కృషి : అంబటి

Published Sat, Apr 25 2020 1:29 PM

YSRCP MLA Ambati Rambabu Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా లాంటి కష్ట సమయంలోనూ ప్రతిపక్ష టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలు, ప్రముఖులు పేదలకు సహాయం చేస్తుంటే టీడీపీ నాయకులు ఒక్కరైనా బయటకు వస్తున్నారా..? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇళ్లల్లో కూర్చొని దీక్షలు చేయడం సరికాదని, అధికారులను మానసికంగా దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని నిలదీశారు. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.

తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ..
కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు.‘కరోనాపై భయపడ కుండా యుద్ధం చేయాల్సిన సమయమిది. లాక్‌డౌన్‌ వలన ప్రజలకు మేలు జరుగుతుంది కానీ సమాజానికి ఇబ్బంది అవుతుంది. కరోనా టెస్టులు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. ప్రభుత్వం పని తీరుకు ఇది నిదర్శనం. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. మీడియాలో ప్రచారం కోసం చంద్రబాబు రోజు సోది కబుర్లు చెపుతున్నారు. సీఎం జగన్‌కు పని చేయడం తప్ప ప్రచారం చేసుకోవడం రాదు. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు సహాయం చేయాలి.

అది భయంకరమైన లేఖ..
నిమ్మగడ రమేష్ కేంద్ర హోమ్ శాఖకు పంపింది భయంకరమైన లేఖ. రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న వ్యక్తి పంపాల్సిన లేఖలా లేదు. కేంద్ర హోంశాఖకు పంపింది నిమ్మగడ రమేష్ రాసిన లేఖ కాదు. ల్యాప్‌టాప్‌, డెస్క్ టాప్, పెన్ డ్రైవ్ నుంచి ఎందుకు ఆధారాలు ధ్వసం చేశారు? ఆధారాలు లేకుండా చేయాల్సిన పరిస్థితి రమేష్‌కు ఎందుకు వచ్చింది. ఆధారాలు ధ్వసం చేయడం దేనికి సంకేతం. ఈ వ్యవహారంలో ఇంకా ఆధారాలు బైటకు రావాల్సి ఉంది.

టీడీపీ కార్యాలయం నుంచి మీడియాకు..
చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలు బొమ్మగా వ్యవహరించారు. చంద్రబాబు ఎక్కడ సంతకం పెట్టమంటే ఎక్కడ నిమ్మగడ్డ రమేష్ అక్కడ సంతకం పెట్టారని అనుమానం. అశోక్ బాబు పంపిన లేఖకు, కేంద్ర హోమ్ శాఖకు పంపిన లేఖకు ఒకే రిపరెన్స్ నెంబర్ ఎలా ఉంటుంది. తప్పు చేసినా వాళ్ళ ఎదో ఒక ఆధారం మర్చిపోతారు. నిమ్మగడ్డ రమేష్ రాసిన లేఖ టీడీపీ కార్యాలయం నుంచి మీడియాకు ఎలా చేరింది. మీడియాకు కూడా నిమ్మగడ్డ రమేష్ లేఖ రాయలేదని చెప్పారు. నేషనల్ మీడియా కూడా రమేష్ లేఖ రాయలేదని చెప్పింది. దీనిపై పూర్తి వివరాలు బయటకు రావాలి’ అని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement