వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం | YSRCP legislature party meeting begin | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం

Oct 26 2017 10:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

YSRCP legislature party meeting begin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  శాసనసభాపక్షం సమావేశం గురువారం ఇక్కడ ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో  సమావేశాలకు హాజరు కావాలా... వద్దా? అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నెల 23న అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్‌ నిర్వహించిన భేటీలో.. అధికారపక్షం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శాసనసభా సమావేశాలను బహిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement