అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటాం

Published Sun, Dec 24 2017 1:16 AM

Ysrcp leaders support to the Agrigold victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడున్నరేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, వారి తరపున న్యాయపోరాటంలో కూడా భాగస్వాములం అవుతామని పార్టీ నేతలు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20 లక్షల కుటుంబాలతో ముడిపడి ఉన్న అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాల్సింది పోయి ఇంకా జటిలం చేస్తోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయిస్తే 20 లక్షల బాధిత కుటుంబాల్లో ముందుగా 14 లక్షల కుటుంబాల సమస్య తీరిపోతుందన్నారు.   బాధితుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి పార్టీ తరపున పోరాడుతామన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా కమిటీ వేస్తామన్నారు. 

Advertisement
Advertisement