బుట్టా రేణుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో | YSRCP Leaders Criticize On MP Butta Renuka | Sakshi
Sakshi News home page

బుట్టా రేణుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో

Jun 10 2018 4:49 PM | Updated on Aug 20 2018 6:10 PM

YSRCP Leaders Criticize On MP Butta Renuka - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

పెరవలి (మద్దికెర) : బుట్టా రేణుక తిన్నింటి వాసాలు లెక్కగట్టే రకమని వైస్సార్‌సీపీ నాయకులు, బసినేపల్లి నీటి సంఘం మాజీ అధ్యక్షడు భద్రయ్య, మాజీ సర్పంచ్‌ ప్రతాప్‌ విమర్శించారు. శనివారం వారు మాట్లాడుతూ ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటున్న బుట్టా రేణకకు జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ టికెట్‌ ఇచ్చి గెలిపిస్తే స్వార్థం కోసం పార్టీ మారడం సిగ్గుచేటన్నారు.

కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీ పంచన చేరారని ఆరోపిస్తున్న రేణక.. ఏమి ఆశించి టీడీపీలో చేరారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విమర్శలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు చౌడప్ప, మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement