‘టీడీపీతో వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది’ | YSRCP Leader YV Subba Reddy Comments On TDP | Sakshi
Sakshi News home page

Dec 15 2018 4:49 PM | Updated on Dec 15 2018 5:39 PM

YSRCP Leader YV Subba Reddy Comments On TDP - Sakshi

సాక్షి, భీమవరం : టీడీపీ ప్రభుత్వ పాలనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పచ్చ చొక్కాలు, టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకొచ్చిన తర్వాత టీడీపీ ఒక్క హామిని కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజల్ని మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే అది వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమని ఉద్ఘాటించారు. భీమవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల సమీక్షా సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ప్రతి బూత్‌ కన్వీనర్‌ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ముదునూరి ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్‌, కె.మోసేనురాజు పాల్గొన్నారు.

ఓటుగా మార్చుకోవాలి..
వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజలు అభిమానంగా ఉన్నారనీ, దీనిని ఓటుగా మార్చుకోవాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్ల మీద ఉందని వైఎస్సార్‌సీపీ నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ అయ్యేలా చూడాలని బూత్ కమిటీ కన్వీనర్లకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement