‘రౌడిషీటర్లని ఎందుకు అనుమతించారో చెప్పాలి’ | YSRCP Leader Gautam Reddy Complaint On TDP Counting Agents | Sakshi
Sakshi News home page

‘రౌడిషీటర్లని ఎందుకు అనుమతించారో చెప్పాలి’

May 21 2019 6:44 PM | Updated on May 21 2019 6:57 PM

YSRCP Leader Gautam Reddy Complaint On TDP Counting Agents - Sakshi

కౌంటింగ్‌ ఏజెంట్లుగా రౌడీషీటర్లని ఎందుకు అనుమతించారో జిల్లా అధికారులు చెప్పాలని గౌతమ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సాక్షి, అమరావతి : ఓటమి భయంతో కౌంటింగ్‌ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు సీఎం చంద్రబాబు పన్నాగం పన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో కౌంటింగ్‌ రోజున గొడవలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు, కుయుక్తులకు తెరతీసిందని అన్నారు. ఆ క్రమంలోనే పదిహేడుమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించిందని ఆరోపించారు.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఆయన మంగళవారం కలిసి ఆధారాలతో సహా టీడీపీ కుట్రలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రౌడీషీటర్లను కౌంటింగ్‌ ప్రక్రియలంలో పాల్గొనకుండా అడ్డుకోవాలని వినతి పత్రం అందించారు. కౌంటింగ్‌ ఏజెంట్లుగా రౌడీషీటర్లని ఎందుకు అనుమతించారో జిల్లా అధికారులు చెప్పాలని గౌతమ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అధికారులను బెదించడం, భయపెట్టడం కాదంటే కాల్లబేరానికి రావడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement