పవన్‌ నోరు అదుపులో పెట్టుకో.. | YSRCP Leader Fire On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ నోరు అదుపులో పెట్టుకో..

May 25 2019 12:44 PM | Updated on Jul 6 2019 3:48 PM

YSRCP Leader Fire On Pawan Kalyan - Sakshi

గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి

కొండాపూర్‌(సంగారెడ్డి): వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను హెచ్చరించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత పవన్‌ కళ్యాణ్‌కు లేదన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమన్నారు.

రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినా ఓటమి పాలైన పవన్‌ కళ్యాణ్‌, జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఎక్కడా మనో ధైర్యం కోల్పోకుండా 9 సంవత్సరాలు ప్రజల్లో ఉండి, ప్రజల కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement