‘పోలీసులు ఏం చేయాలో కూడా చంద్రబాబు చెబుతున్నారు’

YSRCP Leader Darmana Prasada Rao On YS Vivekananda Reddy Murder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి పట్ల ఆ పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందిన ప్రధాన నాయకుడిని హత్య చేశారని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గురించి రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి సీఎం సోదరుడిగా, రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ జీవితం గడిపేవారని గుర్తుచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డికి శత్రువులు లేరని తెలిపారు. అలాంటి వైఎస్‌ వివేకానందరెడ్డిని అతి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు, గొడవలు లేని వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిందేవరో అందరికి తెలుసునని వ్యాఖ్యానించారు. (సరిగ్గా 14 ఏళ్ల క్రితం..)

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘హత్య జరిగిన తర్వాత పోలీసులు ఏం చేయాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తారు. ఎన్నికల కోడ్‌ అమల్లో వచ్చాక కూడా పోలీసులు చేయాల్సిన విచారణ కూడా చంద్రబాబు చేస్తున్నారు. విచారణ పేరిట సిట్‌లు ఏర్పాటు చేస్తు డిపార్ట్‌మెంట్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేశారు. ముఖ్యమంత్రి ఫినిష్‌ చేస్తామనే మాటలు మాట్లాడుతారు.. అలా అంటే రాజకీయంగా ఫినిష్‌ చేస్తారనుకుంటామే కానీ మనుషులనే మాయం చేస్తాడనుకోలేదు. దివంగత మహానేత వైఎస్సార్‌ కుటుంబాన్ని ఫినిష్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగితే దానిని చంద్రబాబు, మంత్రులు హేళన చేశారు. చంద్రబాబు తాను అధికారంలో లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరతారు.. కానీ తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి సీబీఐ రావద్దంటార’ని మండిపడ్డారు. (వైఎస్‌ వివేకా దారుణ హత్య...)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top