పోలీసులా.. లేక టీడీపీ కార్యకర్తలా

YSRCP Leader Chinnapa Reddy Meet To Election Commission - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చిన్నపరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు క్రమశిక్షణ తప్పుతున్నారని అన్నారు. ఏపీ పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తూ సీ విజల్ యాప్ ఫిర్యాదులకు అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. పోలీసులు డబ్బులు,  మందు,  పాంప్లెట్స్  ఉన్న కారుని పట్టుకున్నారని జనం గుమిగూడారు.

అక్కడికి తాము వెళ్లి చూడగా కారు నెంబర్ TN 20 BY 9279 లో టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ ఉన్న అట్టపెట్టి ఉంది. పోలీసులు ఎవరిని దగ్గరకు రానీయకుండా పంపించేశారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ సామాన్యుడికి అవకాశమిచ్చిన సీ విజిల్ ద్వారా ఫిర్యాదు చేయడానికి తాము వీడియో తీయడానికి ప్రయత్నించగా వీడియో తీయకుండా పోలీసులు అడ్డుకొన్నారని తెలిపారు. పోలీసులు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.. ఏదో మిస్ యూజ్ చేయబోతున్నారని  అని తాము సీ విజిల్ లో ఫిర్యాదుకు ప్రయత్నించామని, వారు తమపై ఐపీసీ 353 ప్రకారం కేసు పెట్టి ఇంటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చిన్నపరెడ్డి ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top