కేసీ కెనాల్‌ నీరు విడుదల చేయాలి : వైఎస్సార్‌సీపీ

YSRCP Demands For Release KC Canal Water - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కడప జిల్లాలోని కేసీ కెనాల్‌ నుంచి తెలుగు గంగా, బ్రహ్మం సాగర్‌ కాలువలకు సాగు కొరకు నీటిని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. నీటిని విడుదల చేయకపోతే వైఎస్సార్‌సీపీ తరుఫున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, రఘురామిరెడ్డి, అంజద్‌ బాషా, కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌ బాబా పేర్కొన్నారు. ఆగస్ట్‌ 1 లోపు నీటిని విడుదల చేయాలని గురువారం ఓ సమావేశంలో మాట్లాడుతు ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. జిల్లాలో కాలువలకు నీటిని విడుదల చేయాలని  రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశించిన్పటికి అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top