జగన్‌ విజయం ప్రజా విజయం 

YSR Congress Party Leader Prudhvi Raj Comments On YS jagan Victory - Sakshi

సినీ నటుడు పృథ్వీరాజ్‌  

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయం ప్రజా విజయమని నటుడు, వైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మరో సినీ నటుడు కృష్ణుడు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏడాదిన్నర క్రితమే జగన్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నారని, ఆయన అయితేనే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని భావించారని తెలిపారు.

పాదయాత్ర మొదలైన రోజే వైఎస్‌ జగన్‌ విజయం ఖాయమయ్యిందన్నారు. ఆయన ఘన విజయంలో సముద్రంలో ఇసుక రేణువులా తన పాత్ర కూడా ఉండడం సంతోషమన్నారు. జగన్‌ మంచి ముఖ్యమంత్రిగా తప్పక పేరు తెచ్చుకుంటారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top