
వైఎస్ జగన్ పాదయాత్ర 228వ రోజు శనివారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది.
సాక్షి, పిఠాపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)