వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూల్‌ | YS Jagan Prajasankalpayatra 239th Day Schedule Released | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూల్‌

Aug 17 2018 4:38 PM | Updated on Aug 17 2018 4:42 PM

YS Jagan Prajasankalpayatra 239th Day Schedule Released  - Sakshi

సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 239వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. నర్సీపట్నంలోని మెట్టపాలెం క్రాస్‌ రోడ్డు, బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్‌ వరకు పాదయాత్ర సాగుతుంది.

అనంతరం నర్సీపట్నం టౌన్‌లోని కృష్ణాపురం, దుగ్ధ క్రాస్‌ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత లంచ్‌ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పున: ప్రారంభమౌతుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement