వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

YS Jagan Mohan Reddy Taking Great Decisions, Says Varaprasad - Sakshi

ఆయన చిన్న వయస్సులోనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు

స్థానికులకు 75శాతం ఉద్యోగాల బిల్లుపై అసెంబ్లీలో చర్చలో వరప్రసాద్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్న వయస్సులోనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇది గొప్ప విషయమని, ఈ చట్టం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కేటాయించడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. మనస్సాక్షి లేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తన హయాంలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని విమర్శించారు. ఈ బిల్లులోని నిబంధనలు ఉల్లంఘించినవారిపై పెనాల్టీ విధించేలా చట్టంలో చేర్చాలని కోరారు. ఈ బిల్లు అమలు విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశముండాలన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు సబ్సిడీ అందించాలని కోరారు. 

పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలతో నిరుద్యోగ యువత వలసలు ఇకపై ఉండబోవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. పేదలపై సీఎం వైఎస్‌ జగన్‌కసు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. లక్షలాది ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు హోదాను తాకట్టుపెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, చంద్రబాబు చేసిన తప్పులు యువతకు శాపంగా మారాయన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయన్నారు. 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం మంచి నిర్ణయమని కొనియాడారు. ప్రజలకు మేలు చేసే మంచి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నా.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top