‘అన్న కోసం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

YS Jagan Launched Anna Kosam Website - Sakshi

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘అన్న కోసం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో  ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న జననేత మంగళవారం ఈ వెబ్‌సైట్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి ప్రచారం కోసం ఈ వెబ్‌సైట్‌ ఉపయోగపడుతోందన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి వైఎస్సార్‌ సీపీ ఉన్నతి కోసం పనిచేస్తామని చాలా మంది ముందుకొస్తున్నట్టు తెలిపారు.

పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారి సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో వారందరి కోసం ఈ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసినట్టు ఆయన వెల్లడించారు. వైఎస్సార్‌ సీపీ అభిమానులు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top