ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires On Chandrababu Naidu Over Stopped Ram Gopal Varma Press Meet | Sakshi
Sakshi News home page

ఇంతకీ వర్మ చేసిన తప్పేంటి : వైఎస్‌ జగన్‌

Apr 29 2019 8:06 AM | Updated on Apr 29 2019 9:50 AM

YS Jagan Fires On Chandrababu Naidu Over Stopped Ram Gopal Varma Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ప్రెస్‌ మీట్‌ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బంట్రోతులు కన్నా హీనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 

చదవండి : బాబూ.. ఎక్కడ ప్రజాస్వామ్యం?

రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని, ఇలాంటి వైఖరి గర్హనీయమని పేర్కొంటూ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement