మోదీకి కడప దెబ్బ రుచి చూపించాలి

YS Avinash Reddy Rally In Chennuru YSR Kadapa - Sakshi

ఉప ఎన్నికలు వస్తే టీడీపీ, బీజేపీలకు గుణపాఠం నేర్పాలి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిలుపు

చెన్నూరులో భారీ ర్యాలీ, యువభేరి

కడప కార్పొరేషన్‌ : పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ప్రధాని నరేంద్రమోదీకి కడప దెబ్బ రుచి చూపించాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చెన్నూరు మండలంలో యువ నాయకులు టి. రాఘవరెడ్డి, ఎం. వంశీక్రిష్ణారెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా ఆలంఖాన్‌పల్లె ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. చెన్నూరులో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలను ఊరేగించారు. అనంతరం గోసుల కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో ఎంపీ అవినాష్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, జిల్లాకు ఉక్కు పరిశ్రమపై కేంద్రం ఏప్రిల్‌ 6వ తేదిలోగా స్పష్టత ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, ఆ మేరకు కేంద్రం ప్రకటించలేదు కాబట్టి వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీలందరం రాజీనామా చేశామన్నారు. రేపో, మాపో తమ రాజీనామాలు ఆమోదం పొందితే ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను విస్మరించిన బీజేపీకి, నాలుగేళ్లుగా మాట మార్చుతూ రాష్ట్ర ప్రజలను వంచించిన టీడీపీకి గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించినప్పటి నుంచి ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తుపెట్టుకొని మేలు చేస్తామని భరోసా ఇచ్చారు.

జగన్, బీజేపీలను విమర్శించడానికే మహానాడు పెట్టినట్లుంది : రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బీజేపీని విమర్శించేందుకే మహానాడు పెట్టినట్లుగా ఉందని  కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడలేదన్నారు. వైఎస్‌ జగన్‌పై కేసులను వేగవంతం చేయాలనే ఆయన అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం, పోలవరం, పట్టిసీమ కాంట్రాక్టుల్లో లక్షల కోట్లు దోచుకున్నారని ఆ రోపించారు.  ఎంపీ స్థానాలకు ఉప ఎ న్నికలు వస్తే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి బాసటగా నిలి చి ప్రపంచానికి తెలిసేలా మెజార్టీ ఇవ్వాలని కోరారు.

అబద్ధాలు, మోసాలతోకాలం వెళ్లబుచ్చుతున్న బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలు, అబద్దాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి విమర్శించారు. గత అక్టోబర్‌లో కేసీ కెనాల్‌కు నీరు వచ్చాయని, ఇప్పటి వరకు  రాలేదన్నారు. రాజోలి ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్‌కు శాశ్వతంగా నీరు వచ్చేలా చేయాలని దివంగత వైఎస్‌ఆర్‌ పదేళ్లక్రితమే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కానీ రాజోలి రిజర్వాయర్‌ను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. జిల్లాకు 22 సార్లు వచ్చిన సీఎం చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఈనెల 6న సీఎం జిల్లాకు వస్తున్నారని, ఆయన రాకకు ముందే ఈనెల 5న ప్రొద్దుటూరు, మైదుకూరు, చెన్నూరు మీదుగా నిర్వహిస్తున్న ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.

కడప దెబ్బకు మోదీ అబ్బ అనాలి : అంజద్‌బాషా
ఉప ఎన్నికల్లో కడప ప్రజలు కొట్టే దెబ్బకు ప్రధాని నరేంద్రమోదీ అబ్బ అనాలని కడప శాసన సభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని «ధ్వజమెత్తారు.  ఐదుకోట్ల ఆంధ్రుల హక్కులను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన నీచుడు బాబేనన్నారు. ఉప ఎన్నికలకు అంతా సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

చంద్రబాబు నాలుక అబద్దాల పుట్ట : సురేష్‌బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుక అబద్ధాల పుట్ట అని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోనియాగాంధీని ఎదిరించి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కడప ప్రజలు 5లక్షలా 45వేల మెజార్టీ ఇచ్చి ఢీల్లీని దడ దడలాడించారన్నారు. ఇప్పుడు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే కడప దెబ్బకు ఢిల్లీ అబ్బ అనేలా మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. 

వైఎస్‌ఆర్‌ సువర్ణపాలన జగన్‌తోనే సాధ్యం:మల్లికార్జునరెడ్డి
దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అందించిన సువర్ణపాలన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి అన్నారు. మరో 8 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, వాటిని ఎదుర్కోవడానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రోజుకో మాట మార్చుతూ చెబుతున్న అబద్దాలను ప్రజలకు వివరించాలన్నారు. జగన్‌ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. పార్టీ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు అండగా నిలబడుతామని తెలిపారు.

ముఖ్యమంత్రి వాగ్దానాలతో ప్రజలు విసుగెత్తిపోయారు
ముఖ్యమంత్రి చంద్రబాబు వాగ్దానాలతో ప్రజలు విసుగెత్తిపోయారని యువ నాయకులు టి. రాఘవరెడ్డి, వంశీక్రిష్ణారెడ్డి అన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, పార్టీ అధ్యక్షుడు సురేష్‌బాబు, మల్లికార్జునరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారితోపాటు 600 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవైపే ఉందని, వైఎస్‌ జగన్‌ను సీఎం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు అఫ్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని పోరాటాలు, సుదీర్ఘ పాదయాత్ర వైఎస్‌ జగన్‌ చేశారని కొనియాడారు. జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున పార్టీలోకి రావాల్సిన అవసరముందన్నారు. గత ఎన్నికల్లో చెన్నూరుకు వచ్చిన చెడ్డపేరును తుడిచేసేలా మెజార్టీ తీసుకురావాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ చెన్నూరు మండల అధ్యక్షుడు జీఎన్‌ భాస్కర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సం బటూరు ప్రసాద్‌రెడ్డి, చీర్ల సురేష్‌ యాదవ్, రఘునా థరెడ్డి, బి.నిత్యానందరెడ్డి, సర్పంచ్‌ రాజేశ్వరి, రా ణాప్రతాప్‌రెడ్డి, డా.ఆదర్శ్‌ రెడ్డి,పత్తి రాజేశ్వరి, బోలా పద్మావతి, టీపీ వెంకట సుబ్బమ్మ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top