ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయం

YCP victory in the forthcoming elections - Sakshi

రౌతులపూడి (ప్రత్తిపాడు) : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌ సీపీదే విజయమని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఎన్‌ఎన్‌ పట్నంలో పార్టీనాయులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైస్‌ రాజశేఖర్‌రెడ్డి, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ప్రారంభోత్సవానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు ప్రజా సంక్షేమం పట్టని బాబుకు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్షలు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో కుమ్మక్కై ప్యాకేజికోసం హోదాను అడ్డుకున్న బాబు హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని ఆయన ప్రజలకు సూచించారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీకి పట్టకట్టారని, అయితే దురదృష్టవశాత్తూ ఆ ఎమ్మెల్యే టీడీపీ గేలానికి చిక్కి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అంతకు ముందు దివంగత మహానేత సతీమణి, జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ జన్మదినం సందర్భంగా స్థానిక నేత సింగంపల్లి చిట్టిబాబు స్వృగృహంలో జన్మదిన కేక్‌ను కట్‌చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంచారు. అనంతరం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, మండల కన్వీనర్లు జిగిరెడ్డి శ్రీను, కూనిశెట్టి మాణిఖ్యం, బెహరా దొరబాబు, ఎంపీటీసీ సభ్యురాలు సింగంపల్లి వెంకటలక్ష్మి, దళే చిట్టిబాబు, సీహెచ్‌ వీరవెంకట సత్యనారాయణ, గాబు కృష్ణ, అడపా సోమేష్, సకురు గుర్రాజు, యెనుముల కోటిబాబు, మానివెల్తి వెంకటరమణ, వడల సత్యనారాయణ, చిట్రా రెడ్డి, మాదాసు దొంగబాబు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top