తాజ్‌ మహల్‌పై ప్రధాని తొలిసారి ప్రకటన

What says Prime Minister Narendra Modi Amid Taj Mahal Controversy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాజ్‌ మహల్‌పై పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని విమర్శలపాలు చేస్తుండటంతో వాటికి పుల్‌ స్టాప్‌ పెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. తొలిసారి ఆయన తాజ్‌మహల్‌పై స్పందించారు. వారసత్వ కట్టడాలను మరిచి ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదని చెప్పారు. 'చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవు. ఒక వేళ అలా చేయాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక కచ్చితమైన సమయంలో తమ గుర్తింపును కోల్పోతారు' అని చెప్పారు.

మంగళవారం ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఆయన తాజ్‌ మహల్‌పై మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ తాజ్‌మహల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారతీయ సంస్కృతిపై తాజ్‌మహల్‌ మాయని మచ్చ అని అనడంతో సోషల్‌ మీడియాతోపాటు పలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌ పర్యాటక ప్రాంతాల్లో తాజ్‌ మహల్‌ను పేర్కొనకపోవడంతో ధుమారం రేగిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top