బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ హవా

West Bengal panchayat election Trinamool Congress huge success - Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) భారీ విజయం సాధించింది. సంఖ్యాపరంగా తక్కువ అయినప్పటికీ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్న సీపీఎం ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం.. 19,394 గ్రామ పంచాయతీలను టీఎంసీ, 5,050 పంచాయతీలను బీజేపీ గెలుచుకోగా, 1,306 చోట్ల  సీపీఎం, 918 చోట్ల కాంగ్రెస్‌ గెలుపొందాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. దీంతోపాటు పంచాయతీ సమితుల ఫలితాల్లోనూ అధికార పార్టీ మంచి ఫలితాలను నమోదు చేసుకుంది. టీఎంసీ 560 పంచాయతీ సమితులను గెలుచుకుని, 350 సమితుల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాలను గెలుచుకుని మరో 16 చోట్ల మెజారిటీ దిశగా సాగుతోంది. జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 55 స్థానాలను గెలుచుకుని 30 చోట్ల పూర్తి ఆధిక్యంలో ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top