‘కియా తానే తెచ్చినట్లు చంద్రబాబు కటింగులు’ | Vijaya Sai Reddy Slams Chandrababu Over Kia Motors Publicity | Sakshi
Sakshi News home page

Jan 30 2019 8:39 PM | Updated on Jan 30 2019 8:47 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Over Kia Motors Publicity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కియా కార్ల పరిశ్రమను అనంతపురంలో పెట్టేందుకు హ్యుందాయ్‌ కంపెనీని ఒప్పించింది ప్రధాన మంత్రి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు.  కియా మోటార్స్‌ను తమిళనాడులో నెలకొల్పేందుకు ఆ సంస్థ సిద్ధమైన తరుణంలో.. అది ఏపీని ఎంపిక చేసుకునేలా ఆయన ఒత్తిడి తెచ్చారని చెప్పారు. కియా మోటార్స్‌ను ఏపీకి తానే తీసుకొచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు.

ప్రజలు అదంతా మర్చిపోయారనుకుని.. చంద్రబాబు కష్టపడి కియాను ఏపీకి తెచ్చినట్టు కటింగులిస్తున్నారని విమర్శించారు. కియా కార్ల ఉత్పత్తికి ఇంకా ఏడాది పడుతుందని ఆ కంపెనీ వెబ్‌సైట్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అనంతపురం కియా మోటార్స్‌లో మొదటి కారు తయారైందని చంద్రబాబు షో చేశారని విమర్శించారు. చెన్నై ప్లాంటు నుంచి తెచ్చిన ఇంజన్‌, విడిభాగాలతో అసెంబ్‌లు చేసిన కారును విడుదల చేశారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement