'కుల మేధావి కిరసనాయిలు సలహా తీసుకో' | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Yellow Media | Sakshi
Sakshi News home page

'కుల మేధావి కిరసనాయిలు సలహా తీసుకో'

Mar 9 2020 11:19 AM | Updated on Mar 9 2020 11:29 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఆయన చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు. 'రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 'యస్‌ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు'

కాగా మరో ట్వీట్‌లో 'యస్‌ బ్యాంక్‌ పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది' అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: బయటకొచ్చి మాట్లాడు చిట్టీ: విజయసాయి రెడ్డి

వారిపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement