మీ పేరు నారా రాజగోపాల్‌గా మార్చుకోండి..

vijaya sai reddy reacts on lagadapati rajagopal survey - Sakshi

ఆంధ్రా ఆక్టోపస్ కాదు..ఇది ఎల్లో జలగ..

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వేపై వైఎస్సార్ సీపీ నేత విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘40 వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి దివాలా తీశాడు. దీన్ని ఆసరా చేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్ కుదిరించాడు. తెలంగాణా ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్ సర్వే ఇచ్చి వెయ్యి కోట్లు సంపాదించారు. మళ్లీ సేమ్ డ్రామా. బుకీలు యాక్టివ్ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్‌పై పెట్ట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 లోగా బుకీలు సేఫ్. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టులు, బుకీస్ ఇచ్చే కమిషన్లపై రోజులు వెళ్లదీస్తున్నాడు లగడపాటి. భీమవరం,విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ ఆడేవారు 90 శాతం ఫ్యాన్ గెలుస్తుందని పెట్టారట. బుకీలు వేల కోట్లు నష్టపోయేట్టున్నారు. లగడపాటి - కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడు.ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయేదానికి ఎందుకులే అని తప్పుకున్నాడు. ఇప్పుడే పార్టీతో సంబంధం లేదని కోస్తున్నాడు. కన్నాలేసే దొంగకు ఏఇంట్లో దూరితే ఏం దొరుకుతుందో అంచనా వేసే సిక్త్స్ సెన్స్ ఒకటి ఉండి చస్తుంది. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే. 23న కౌంటింగ్ ప్రారంభం కాగానే బాబు ఏమంటాడంటే ... గెలుస్తామని లగడపాటి చెప్పాడు. అయినా ఓడుతున్నామంటే అందుకు ఈవీఎం ట్యాంపరింగే కారణం అని చెప్పేందుకే ఈ గోల. ఆంధ్రా ఆక్టోపస్ కాదు...ఇది ఎల్లో జలగ! లగడపాటి గారూ... మీ పేరును నారా రాజగోపాల్‌గా మార్చుకోండి.’  అంటూ ఆయన ట్విట్‌ చేశారు. 

కాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెట్టింగ్‌లు కాసి, సొమ్ము చేసుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గూటి చిలుక లగడపాటి రాజగోపాల్‌ పెద్ద స్కెచ్‌ వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించబోతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆయన ఢంకా బజాయించారు. దాంతో బెట్టింగ్‌ రాయుళ్లంతా మహా కూటమి గెలుస్తుందంటూ పందేలు కాశారు. కానీ, లగడపాటి మాత్రం తన అనుచరులతో అధికార టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమంటూ బెట్టింగ్‌లు కాసేలా జాగ్రత్త పడినట్లు విమర్శలు వినిపించాయి.

చివరకు టీఆర్‌ఎస్‌ నెగ్గడంతో బెట్టింగ్‌ల్లో లగడపాటి మనుషులు భారీగా ఆర్జించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని లగడపాటి అమలు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలవడడానికి 24 గంటల ముందే నిన్న మీడియాతో మాట్లాడారు. ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని తమ సర్వేలో తేలినట్లు సంకేతాలిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top