‘అలా అయితే రేవంత్‌తోనే ఫ్లయిట్‌ ఎక్కేదాన్ని’ | uma madhava reddy chit chat with media | Sakshi
Sakshi News home page

‘హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తోనే ఫ్లయిట్‌ ఎక్కేదాన్ని’

Nov 17 2017 2:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

uma madhava reddy chit chat with media  - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో  టీడీపీ పని అయిపోయిందని అందరికీ తెలుసునని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఉమ మాధవరెడ్డి  వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఉమ మాధవరెడ్డి...‘ కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ రెడ్డికి స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చు. నాతో ఎవరు మాట్లాడకుండానే కాంగ్రెస్‌లో ఎలా చేరతా. హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తోనే ఫ్లైట్‌ ఎక్కేదాన్ని. టీఆర్‌ఎస్‌లో చేరాలని గతంలో ఆహ్వానించారు. మళ్లీ ఆలోచిస్తే పునరాలోచిస్తా.’ అని తెలిపారు.

కాగా ఉమ మాధవరెడ్డి టీడీపీని వీడనున్నట్టు గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రేవంత్‌ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సమయంలో మరోసారి ఆమె హస్తం చేయి అందుకుంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఆ వార్తలను ఉమ మాధవరెడ్డి ఖండించారు కూడా.  అయితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డితో ఆమె చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement