యశ్వంత్‌ సిన్హా దీక్ష.. సీఎంల మద్దతు

Two CM's Gives Support to Yashwant Sinha's Protest - Sakshi

ముంబై : విదర్భ ప్రాంతంలోని రైతుల డిమాండ్‌ను పరిష్కరించే వరకూ పోలీస్‌ గ్రౌండ్‌లోనే దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ నేత యశ్వంత్‌ సిన్హా(79) పేర్కొన్నారు. యశ్వంత్‌కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌లు మద్దతు తెలిపారు. 

సోమవారం రైతుల డిమాండ్లను పరిష్కరించాలంటూ యశ్వంత్‌ సిన్హా అకోలాలోని ఓ రోడ్డుపై దీక్షకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యశ్వంత్‌ను వదిలేసినట్లు రాత్రి 09.50 నిమిషాల సమయంలో వదిలేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

దీనిపై మాట్లాడిన యశ్వంత్‌.. పోలీసులు అదుపులోకి తీసుకుని తమను ఎక్కడికి తీసుకెళ్లినా రైతుల డిమాండ్‌(పురుగుల మందుల కారణంగా నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వడం) నెరవేరే వరకూ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుల కోసం పోరాటం చేపట్టిన యశ్వంత్‌ను కలుసుకోవడానికి తమ ఎంపీని పంపుతున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

250 మంది పత్తి, సోయాబీన్‌ రైతులతో కలసి మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడం వల్లే యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్న మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి వారిని వదిలేసినా దగ్గరలోని పోలీసు మైదానంలో దీక్షకు దిగారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top