డబ్బులిస్తేనే టికెట్‌ ఇచ్చారు: ఎమ్మెల్యే

Tickets Are Given For Money Says BSP MLA From Rajasthan - Sakshi

 జైపూర్‌: రాజస్తాన్‌ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గుదా ఆ పార్టీ చీఫ్‌ మాయావతిపై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వడానికి మాయావతి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. తన కంటే ఎక్కువ మొత్తం ఇంకా ఎవరైనా ఇచ్చిఉంటే టికెట్‌ తనకు కాకుండా వేరే వాళ్లకు దక్కేదంటూ విమర్శించారు. శుక్రవారం జైపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో రాజేంద్ర మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల నాయకులు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే.. టికెట్లు వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాగా మాయావతిపై ఇంతకుముందు ఇదే విధంగా పలువురు నేతలు  ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీఎస్పీ ఇప్పటి వరకు ఎలాంటి ‍ప్రకటన చేయలేదు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top