కీలక సెగ్మెంట్స్‌: ఈ విషయాలు మీకు తెలుసా!

Three Lok Sabha Seats That Attract People's Attention - Sakshi

వారణాసి  పార్లమెంట్‌ నియోజక వర్గం:


కాంగ్రెస్, కమలం పోటాపోటీ
ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో కీలకమైనది వారణాసి.ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు (రోహనియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్,వారణాసి కంటోన్మెంట్, సేవాపురి)ఉన్నాయి.పవిత్ర పుణ్యక్షేత్రం కాశీనే వారణాసి అని కూడా పిలుస్తారు. జిల్లా కేంద్రమైన వారణాసి జనరల్‌ నియోజకవర్గం.1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఏడు సార్లు, బీజేపీ ఆరు సార్లు గెలిచింది.సీపీఎం, జనతాదళ్,భారతీయ లోక్‌దళ్‌ ఒక్కోసారి విజయం సాధించాయి.2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3.71 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ ఎన్నికల్లో నోటాకు రెండు వేలకుపైగా ఓట్లు వచ్చాయి.

అమేథి పార్లమెంట్‌ నియోజక వర్గం:

గాంధీ–నెహ్రూ కుటుంబ అడ్డా
ఉత్తరప్రదేశ్‌లో మరో కీలక లోక్‌సభ నియోజకవర్గం అమేథీ. 1967లో ఇది ఏర్పాటైంది. దీని పరిధిలో ఐదు శాసన సభ నియోజకవర్గాలు (తిలోయి, సలాన్, జగ్‌దీశ్‌పూర్, గౌరీగంజ్, అమేథీ) ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పాటు నుంచీ కాంగ్రెస్‌కు కంచుకో టగా నిలుస్తోంది. గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందిన సంజ య్‌గాంధీ (1980), రాజీవ్‌గాంధీ (1981), సోనియాగాంధీ (1999) ఇక్కడ నుంచి గెలిచారు. సోనియా తర్వాత ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ ప్రస్తుతం ఇక్కడ  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 నుంచి ఆయన వరుసగా మూడు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. అయితే, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ, 1998 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ గెలిచాయి. గత ఎన్నికల్లో (2014) రాహుల్‌ గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1.07 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

రాయ్‌బరేలి పార్లమెంట్‌ నియోజక వర్గం:

కాంగ్రెస్‌కు కంచుకోట
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తల్లి సోనియాగాంధీ ప్రాతి నిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జనరల్‌ కేటగిరీకి చెందిన ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు (బచరవాన్, హర్‌చంద్‌పూర్, రాయ్‌బరేలీ, సరేని, ఉం ఛర్‌) ఉన్నాయి. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 16 సార్లు, బీజేపీ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు (1967,71) వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ, అజయ్‌ అగర్వాల్‌ (బీజేపీ)ను 3,52,713 ఓట్ల తేడాతో ఓడించారు. 1999 నుంచి సోనియా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top