ఆయన ప్రపంచకప్‌ చూస్తూ బిజీగా ఉండొచ్చు..

Tejashwi Yadav Maybe In England For world Cup Says RJD leader - Sakshi

పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో 100 మందికి పైగా పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన బిహార్‌లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌పై కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పకుండా తేజస్వీ ఎక్కడున్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్లపై ఆ పార్టీ సీనియర్‌ నేత రఘవిశ్‌ ప్రసాద్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘మా నాయకుడు (తేజస్వీ యాదవ్‌) ఎక్కడికి వెళ్లారో మాకు కూడా తెలీదు. నాకు తెలిసి లండన్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను చూస్తూ.. బిజీగా గడుపుతూ ఉండొచ్చు’’అని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.

కాగా ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుంచి తేజస్వీ పెద్దగా బయట కనిపించట్లేదు. కాగా ముజఫర్‌పూర్‌ జిల్లాలో ఇప్పటి వరకూ 100 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం తెల్సిందే. వ్యాధి వ్యాప్తిపై పట్నాలో అధికారులతో భేటీ తర్వాత నితీశ్‌ ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రి ఐసీయూలోకి వెళ్లారు. దీంతో అక్కడ కొందరు ‘నితీశ్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top