యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. భారీగా సైకిళ్ల స్వాధీనం! | TDP Leaders Violate Election Code in Anantapur | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. భారీగా సైకిళ్ల స్వాధీనం!

Mar 24 2019 8:50 PM | Updated on Mar 24 2019 8:54 PM

TDP Leaders Violate Election Code in Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలో అధికార టీడీపీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంచేందుకు టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బీహార్‌ నుంచి తీసుకొచ్చిన కార్మికుల చేత సైకిళ్లను బిగిస్తున్నారు.  ఈ మేరకు ఎన్నికల నేపథ్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన సైకిళ్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. జిల్లాలోని పరిగి మండలం సేవమందిరంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న 580 సైకిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement