
మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విధి లేకే సోనియా తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 కాదు .. కనీసం 7 సీట్లు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్నారు.
గ్రేటర్ లో ఒక్క సీటు కూడా గెలవని మీరు ప్రత్యామ్నామయా అని తలసాని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. అసత్యాలు మాట్లాడితే కేసు పెట్టే చట్టం తీసుకువస్తామన్నారు. నోటికి వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తలసాని హెచ్చరించారు. మరో వైపు పొత్తు పెట్టుకోకుండా బీజేపీ 10 స్థానాల్లో ఎపుడు గెలవలేదని తెలిపారు.