‘నాకు ప్రచారం చేసేవారికి ప్రాణహాని’ | Sumalatha alleges threat to those campagining for her | Sakshi
Sakshi News home page

‘నాకు ప్రచారం చేసేవారికి ప్రాణహాని’

Apr 22 2019 5:39 AM | Updated on Apr 22 2019 5:39 AM

Sumalatha alleges threat to those campagining for her - Sakshi

సుమలత అంబరీష్‌

బెంగళూరు: తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసే వారికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందని సినీ నటి, మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత అంబరీష్‌ ఆరోపించారు. ఆదివారం ఆమె మండ్యాలో మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన వారందరినీ టార్గెట్‌ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసిన సినీ నటులు భవిష్యత్‌లో పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని కొందరు రాజకీయనేతలన్నారు. దీనిలో ఉన్న ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రకటనలో తన మద్దతుదారులకు హాని తలపెట్టాలనే ఉద్దేశం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement