
కువైట్, గల్ఫ్ నేతలు బాలిరెడ్డి, ఇలియాస్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన ఎస్సీ, బీసీ నాయకులు
సాక్షి, రాజంపేట: కువైట్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ అధ్యక్షుడు ఇలియాస్, కువైట్ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో పలువురు ఎస్సీ, బీసీలు శనివారం కువైట్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన భువనగిరి సుబ్బయ్య, రేవూరు రాజగోపాల్, రేవూరు రామచంద్రయ్య, తాళ్లపాక శేఖర్, పోలూరు ప్రభాకర్, జోరోపల్లె శివయ్య తదితరులతోపాటు వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలంలోని తిరుమలరాజుపేటకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ జననేత జగన్‌మోహనరెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. ప్రస్తుత పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరిన సభ్యులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నిరంతరం ప్రజల కోసం పడుతున్న తపన తమను ఆకర్షించిందన్నారు. ఆయన సీఎం అయితే రాష్ట్రంలో వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ చూడవచ్చన్నారు. పార్టీలోకి చేరేందుకు అవకాశం కల్పించిన బాలిరెడ్డి, నరసారెడ్డి, మహేశ్వరరెడ్డి, గోవిందు నాగరాజు, బీఎన్ సింహాలకు కృతజ్ఞతలను తెలిపారు.