సభలో యెడ్డీ ప్రసంగిస్తున్న వేళ... | Siddaramaiah and Revanna Sleep in Assembly | Sakshi
Sakshi News home page

May 19 2018 4:22 PM | Updated on May 19 2018 6:51 PM

Siddaramaiah and Revanna Sleep in Assembly - Sakshi

యెడ్యూరప్ప ప్రసంగ సమయంలో రేవణ్ణ నిద్రిస్తున్న ఫోటో

సాక్షి, బెంగళూరు: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కర్ణాటక సీఎం యెడ్యూరప్ప.. అసెంబ్లీలో భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి సోదరుడు, జేడీఎస్‌ ఎమ్మెల్యే రేవణ్ణ సీరియస్‌గా కునుకు తీశారు. మరోవైపు ప్రమాణ స్వీకారం ముగిశాక భోజన విరామ సమయంలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా ఆదమరిచి నిద్రపోయారు. ఓవైపు బలనిరూపణ గురించి కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలంతా హడావుడి పడుతుంటే.. వాళ్లు కూల్‌గా కునుకు తీయటం విశేషం. ఇంకోవైపు సోషల్‌మీడియాలో వాళ్ల ఫోటోలపై జోకులు పేలుతున్నాయి. ఏదైతేనేం తమ వద్ద తగినంత బలం లేదని ఒప్పుకున్న యడ్యూరప్ప చివరకు ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement