‘టీడీపీ అధర్మ పాలన వల్లే 29 మంది మృతి’

Shiva Swamy Critics On Justice Somayajulu Commission - Sakshi

టీడీపీ ప్రభుత్వం, జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌పై శివస్వామి ఫైర్‌

సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి టీడీపీ ప్రభుత్వం, జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌పై నిప్పులు చెరిగారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కొసలాటకు మీడియా అత్యుత్సాహం, భక్తుల అవగాహనాలేమి కారణమని తేల్చిన సోమయాజులు కమిషన్‌కు భారతరత్న, ఆస్కార్‌ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అధర్మపాలన సాగుతోంది కనుకనే అంతటి ఘోరం జరిగిందని వాపోయారు. పుష్కరాల్లో చనిపోయిన 29 మంది కుటుంబాల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు.

టీడీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు..
తిరుమల శ్రీవారి ఆభరణాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శివస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పోలీసులు తనపై మూడు అక్రమ కేసులు పెట్టారని, విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను విచారించాల్సిందిపోయి.. శైవక్షేత్ర ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు మంచి తీర్పునిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి :  దోషం భక్తులది.. పాపం మీడియాది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top