కేసీఆర్‌ ఇక్కడ పులి.. ఢిల్లీలో పిల్లి | shabbir ali commented over kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఇక్కడ పులి.. ఢిల్లీలో పిల్లి

Feb 17 2018 2:43 AM | Updated on Aug 15 2018 9:04 PM

shabbir ali commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌లో పులిలాగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి పోగానే పిల్లి లెక్క ఎందుకు మారుతున్నారు’అని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. తనపై ఉన్న కేసుల భయంతోనే మోదీ ముందు మోకరిల్లుతున్నారని ఆరోపించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి 40 వేల కోట్లు విడుదల చేయించాలని మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కేవలం 450 కోట్ల రూపాయలు కావాలని వినతిపత్రం ఇచ్చారని చెప్పారు. ఇక్కడ ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ఎందుకు ఇలా వ్యవహరించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కందులు, ఎర్రజొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ముస్లిం రిజర్వేషన్‌ ఫైలు ఎక్కడుందో తెలుసుకుని వెంటనే ఢిల్లీ నుంచి తెప్పించాలని అన్నారు. విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడలేని దద్దమ్మలు టీఆర్‌ఎస్‌ ఎంపీలని విమర్శించారు. పక్కరాష్ట్రంలో పార్టీలకతీతంగా ఎంపీలు పోరాడుతుంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  

Advertisement
 
Advertisement
Advertisement