బాబుకు షాక్‌.. టీడీఎల్పీ భేటీకి పలువురు డుమ్మా

Several MLAs And MLCs Not Attended For TDLP Meeting - Sakshi

సాక్షి, విజయవాడ : రాజధాని అంశంపై టీడీపీ ఆడుతున్న నాటకానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం విజయవాడలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. దీంతో చంద్రబాబుకు గట్టి షాక్‌ తగిలినట్టయింది. 23 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు, 32 మంది ఎమ్మెల్సీల్లో 12 మంది ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. హాజరుకానివారిలో గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌, బి అశోక్‌, అనగాని సత్యప్రసాద్‌, ఆదిరెడ్డి భవాని, వంశీ, మద్దాల గిరితో పాటు పలువురు నేతలు ఉన్నారు.

ఇప్పటికే విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు.. విశాఖను ఎగ్జిక్యూటివ్‌గా క్యాపిటల్‌గా స్వాగతిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వారు ఓ తీర్మానాన్ని కూడా పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రాజధానిపై టీడీపీ సభ్యులు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటని అధిష్టానం ఆందోళన చెందుతున్నట్టుగా సమాచారం. ఈ పరిణామాలు ఇలానే కొనసాగితే.. రాజధానిపై ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ అధినాయకత్వం చేస్తున్న డ్రామాలు మరోసారి బట్టబయలు అవుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top