
సాక్షి, గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించారు.
రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్‌సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ మేవానీ (వడగావ్), సురేశ్ పటేల్ (మణినగర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ (గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున), డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వంటి ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.