గాడ్సే – సావర్కర్‌ల సంబంధం! | Savarkar Had Physical Relationship With Nathuram Godse | Sakshi
Sakshi News home page

గాడ్సే – సావర్కర్‌ల సంబంధం!

Jan 4 2020 4:06 AM | Updated on Jan 4 2020 4:06 AM

Savarkar Had Physical Relationship With Nathuram Godse - Sakshi

ముంబై: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్‌ అనుబంధ ‘సేవాదళ్‌’ పేర్కొనడంపై బీజేపీ, శివసేన మండిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సేవాదళ్‌ విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో ఆ విపరీత వ్యాఖ్యలను పొందుపర్చారు. దీనిపై మహారాష్ట్రలో కాంగ్రెస్‌ మిత్రపక్షం శివసేన స్పందిస్తూ.. సావర్కర్‌ గురించి కాంగ్రెస్‌ నేతల మెదళ్లలో చెత్త ఉందని వ్యాఖ్యానించింది. సావర్కర్‌ దేశభక్తిని, వీరత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వారు తమను తాము కించపర్చుకుంటున్నారని సేన ఎంపీ సంజయ్‌రౌత్‌  పేర్కొన్నారు. సావర్కర్‌పై వికృతబుద్ధితో చేసిన అర్థపర్థం లేని వ్యాఖ్యలు అవని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. వీర్‌ సావర్కర్‌: కిత్నే ‘వీర్‌’! పేరుతో సేవాదళ్‌ ఆ బుక్‌లెట్‌ విడుదల చేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement