టీడీపీకి సాదినేని యామిని రాజీనామా | Sadineni Yamini Resigns To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

Nov 8 2019 8:00 AM | Updated on Nov 8 2019 8:53 AM

Sadineni Yamini Resigns To TDP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తరువాత.. యామిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు ముందు సోషల్‌ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉన్న యామిని... తర్వాతి కాలంలో సైలెంట్‌ అయిపోయారు. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఒక సందర్భంలో యామిని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో.. ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే యామిని వాటిని ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement