మద్యం ధరల పెంపు వెనుక ఓ ఎంపీ! | Revanth Reddy Sees Sales Tax Scam Behind Liquor Price Increase | Sakshi
Sakshi News home page

మద్యం ధరల పెంపు వెనుక ఓ ఎంపీ!

Dec 18 2019 3:27 AM | Updated on Dec 18 2019 3:27 AM

Revanth Reddy Sees Sales Tax Scam Behind Liquor Price Increase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న మద్యం ధరల పెంపు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాల వరకు మాఫియా గుప్పిట్లో ఉందని, తాజా మద్యం ధరల పెంపు విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఢిల్లీ, చెన్నైలలో మకాం వేసి బేరం కుదిర్చారని అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని మంగళవారం ఆయన రాసిన బహిరంగ లేఖలో కోరారు. వెంటనే పెంచిన మద్యం ధరలను ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయస్థానాల ద్వారా సీబీఐ విచారణ కోసం పోరాడుతామని లేఖలో రేవంత్‌ వెల్లడించారు. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ.. ఎక్సైజ్‌ అండ్‌ ప్రమోషన్‌ శాఖగా మారిందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement