నువ్వు నన్నేం పీకలేవ్‌!

Revanth reddy fires on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాం గ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఐటీ దాడుల నేపథ్యంలో తనపై సీఎం సహా అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రేవంత్‌ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వంటి ఉన్నతమైన పదవికి కేసీఆర్‌ అనర్హుడు, అధముడంటూ తీవ్ర స్థాయిలో ఆరో పణలు చేశారు. ‘ఓటుకు కోట్లు కేసులో నన్నేం పీక లేవ్‌. ఏం కావాలంటే అది చేసుకో. నాపై చర్యలు తీసుకుంటే నిన్నెవరు ఆపారు. ఈ కేసులో ముందు నన్ను తాకి తర్వాత చంద్రబాబుపై వరకు వెళ్లాలి కదా’ అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసిన సీఎం కుటుంబం కోసమే నాలుగున్నరేళ్లు పాటుపడ్డారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం 3,152 కేసులు నమోదు చేసిందని రేవంత్‌ గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ సర్కారు కేవలం 1,150 కేసులు మాత్రమే రద్దు చేసిందని.. మరి మిగిలిన 2 వేల కేసుల కేసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఉద్యమం చేశామని, కేసులున్నాయని పదేపదే చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై ఉన్న కేసులే ఎందుకు రద్దయ్యాయో తెలంగాణ సమాజానికి వివరించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

మిగిలిన ఉద్యమకారులు, విద్యార్థులపై ఉన్న కేసులు ఎందుకు అలాగే ఉన్నా యో చెప్పాలన్నారు. పొటీ పరీక్షల సెలక్షన్‌లో తుదిదశకు వచ్చిన ఎందరో అభ్యర్థులు.. ఈ కేసుల కారణంగానే ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నా రు. ఈ దుస్థితికి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులే కారణమన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 260 రైల్వే కేసులు నమోదైతే.. కేవలం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావుపై ఉన్న 10 కేసులు మాత్రమే రద్దయ్యాయన్నారు. ఈ కేసుల మాఫీతోనే కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్‌ చేసుకున్న తెరచాటు ఒప్పందం అర్థంచేసుకోవచ్చన్నారు.

అప్పుడు ముద్దు.. ఇప్పుడు వద్దా?
కల్లు తాగిన కోతి.. తేలుకుడితే ఎలా ఎగురుతుందో కేసీఆర్‌ అలాగే ప్రవర్తిస్తున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశా రు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబుగా చిత్రీకరించేందుకు పాట్లు పడుతున్నారన్నా రు. తెలంగాణ రాకముందు.. 2009లో చంద్రబాబు ముద్దు అన్న కేసీఆర్‌.. ఇప్పుడెందుకు ఆయన్ను వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య ‘హెలికాప్టర్లు, రూ.500కోట్ల సహా యం’ ఒప్పందం జరిగిందని విమర్శిస్తున్న సీఎం.. 2009 సమయంలో బాబు నుంచి ఎన్ని కోట్లు తెచ్చుకున్నాడో ముందు లెక్కచెప్పాలన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ముఖాముఖిగా ఉన్న పోరులో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నా రు. మరోసారి ఉద్యమం సెంటిమెంట్‌ రగిల్చి.. ఓట్లు దండుకునేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ‘చంద్రబాబుకు తెలంగాణతో ఏం సంబంధం, కనీ సం ఆయనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు కూడా లేదనే సంగతి నీకు తెల్వదా? నీకు పోటీ కాంగ్రెస్‌తో అన్న సంగతి మరచిపోవద్దు’ అని మండిపడ్డారు.

24గంటల్లో క్షమాపణ చెప్పకపోతే..!
ఓటుకు కోట్లు కేసులో తన నివాసంపై ఐటీ సోదాల సందర్భంగా 2 చానళ్లు, ఒక పత్రిక పదే పదే తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని రేవంత్‌ మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారం చేసిన ఆ చానళ్లు, పత్రిక యాజమాన్యం 24 గంటల్లో ఆధారాలు చూపాలని.. లేదంటే క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆ చానళ్లు, పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

యాదాద్రి, భద్రాద్రి అని మార్చిందెవరు?
‘ప్రతి దానికి ఆంధ్ర, ఆంధ్ర అంటున్నా వు. ఆంధ్ర వాళ్ల సలహాలు, సూచనలతో నడుచుకుంటున్నది నువ్వు కాదా? తెలంగాణ యాస లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలాన్ని ఆంధ్రా యాసలో యాదాద్రి, భద్రాద్రి అని మార్చింది నువ్వు కాదా? ఈ నాలుగున్నరేళ్లలో ఏమి చేయలేదని ప్రజలకు చెప్పేందుకు భయపడుతున్నా వ్‌. సెంటిమెంట్‌ పేరుతో మరోసారి ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నావ్‌. ఇదే నీ చేతకాని తనం’ అని రేవంత్‌ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌కు అమరావతి వెళ్లినప్పుడు ఈ విషయం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top