టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్‌ | Rebel Shock To MLA Chirumarthi Lingaiah | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్‌

Jan 7 2020 8:01 PM | Updated on Jan 7 2020 8:05 PM

Rebel Shock To MLA Chirumarthi Lingaiah - Sakshi

సాక్షి, నల్గొండ: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో చిట్యాలలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే లింగయ్య వర్గానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున నకిరేకల్‌ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య అనంతర రాజకీయ పరిణామాల్లో టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. అయితే, ఆయన చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు రెబల్స్‌గా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులతో వేముల వర్గం టీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయినట్టు సమాచారం ఎమ్మెల్యే చిరుమర్తి వర్గానికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఇటు టీఆర్‌ఎస్‌ రెబల్స్‌, అటు కాంగ్రెస్‌ నేతలు చేతులు కలిపినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement